నాగార్జున స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎగిరి గంతేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ | Sakshi
Sakshi News home page

Shobha Shetty: నాగార్జున స్పెషల్‌ గిఫ్ట్‌.. ఆనందంలో తేలియాడుతున్న శోభ

Published Fri, Jan 5 2024 1:00 PM

Bigg Boss 7 Telugu Host Nagarjuna Surprise Gift to Shobha Shetty - Sakshi

విలనిజం పండించడం అంత ఈజీ కాదు. విలన్‌గా హీరోహీరోయిన్లను డామినేట్‌ చేయడమూ అంత ఈజీ కాదు. కానీ 'కార్తీక దీపం' సీరియల్‌తో మోనిత అలియాస్‌ శోభా శెట్టి అన్నీ సుసాధ్యమే అని నిరూపించింది. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతలవారిని డామినేట్‌ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.

నాగార్జునను అడిగేసిన శోభ
ఎంతో టాలెంట్‌ ఉన్న ఈ నటి తెలుగు బిగ్‌బాస్‌ 7లోనూ ఛాన్స్‌ దక్కించుకుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ జంకకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్‌ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్‌ చూసి ముచ్చటపడిపోయింది శోభ. అది తనకు కావాలని అడిగింది. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నాగ్‌ నిజంగానే ఆ డ్రెస్‌ను ఆమెకు బహుమతిగా ఇ‍చ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించింది.

గుర్తుపెట్టుకుని మరీ బహుమతిచ్చిన నాగ్‌
'బహుశా ఆరో వారంలో అనుకుంటా.. అప్పుడు నాగార్జున ధరించిన టీ షర్ట్‌ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్‌ అయ్యాను. నేను టీ షర్ట్‌ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్‌ అయిన రోజు నాగ్‌ సర్‌ స్వయంగా ఆ టీషర్ట్‌ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్‌ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్‌ కూడా చేశాను' అంటూ తన షూట్‌ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు.. శోభా అనుకున్నది సాధించింది.. నువ్వు ఇలాగే డేర్‌ అండ్‌ డాషింగ్‌గా ఉండాలి, మరిన్ని మంచి అవకాశాలతో కెరీర్‌లో పైకి ఎదగాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఫుడ్‌ పాయిజన్‌ తర్వాతే ఇలా.. క్రికెట్‌ ఆడేటప్పుడు అలా అవడంతో.
డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్

Advertisement
 

తప్పక చదవండి

Advertisement