బిగ్‌బాస్‌ 5: నాగ్‌తో ఐ లవ్‌యూ చెప్పించుకున్న ఆర్జే కాజల్‌ | Bigg Boss 5 Telugu: RJ Kajal Entered As 17th Contestant In House | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: పదిహేడో కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్‌

Sep 5 2021 9:34 PM | Updated on Dec 19 2021 11:41 PM

Bigg Boss 5 Telugu: RJ Kajal Entered As 17th Contestant In House - Sakshi

'కోరుకున్నవాడి చేయందుకుని చెంతకు చేరిన సంతోషం ఓ కంట ఆనంద భాష్పాలను కురిపిస్తుంటే ఉపాధి చాలని ఆకలిచూపులు మరో కంట కన్నీటి మేఘాలను కరిగించింది. ఆ సమయంలో కమ్మని స్వరంతో కనిపించకుండా వినిపించాను. ఆర్జేగా పని చేశాను. అందరి ముందు సగర్వంగా నిలబడ్డాను' అంటోంది ఆర్జే కాజల్‌.

వాగుడుకాయ, మల్టీ టాలెంటెడ్‌, యూట్యూబర్‌, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్‌, యాంకర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని చేసింది కాజల్‌. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పదిహేడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ తన ఫస్ట్‌ సెలబ్రిటీ ఇంటర్వ్యూ నాగ్‌తోనేనని చెప్పుకొచ్చింది. వచ్చీరావడంతోనే నాగ్‌తో ఐ లవ్‌యూ చెప్పించుకుంది. యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్‌ అయిన కాజల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకెంత ఫేమస్‌ అవుతుందనేది చూడాల్సిందే!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement