అరియానాను చూసి భ‌య‌ప‌డుతున్న సోహైల్‌

Bigg Boss 4 Telugu: Tom And Jerry Fight In Nominations - Sakshi

బిగ్‌బాస్ షోలో అత్యంత క‌ష్ట‌మైనది నామినేష‌న్ ప్రక్రియ‌. అప్ప‌టివ‌రకు అంద‌రితో న‌వ్వుతూ క‌లివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేష‌న్ వ‌చ్చేస‌రికి మాత్రం చిన్న చిన్న కార‌ణాల‌ను కూడా భూత‌ద్దంలో పెట్టి చూపుతూ నామినేట్ చేస్తుంటారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో చిన్న‌పాటి యుద్ధ‌మే జరుగుతుంది. వారు చెప్పే అంశాల‌ను అంద‌రూ ఏకీభ‌వించ‌లేరు. ఈ క్ర‌మంలో అప్ప‌టివ‌ర‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న‌వాళ్లు కూడా దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. అయితే ఈవారం నామినేష‌న్‌లో సోహైల్‌కు పెద్ద చిక్కొచ్చి ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. అరియానాను నామినేట్ చేయాల‌ని వ‌చ్చాడు. కానీ అత‌డికి స్నేహం అడ్డొస్తుంది. (చ‌ద‌వండి: ఎవ‌రికి లేరు అమ్మానాన్న?: అమ్మ రాజ‌శేఖ‌ర్)

మ‌రోవైపు సోహైల్ కూడా త‌న‌ను టార్గెట్ చేస్తాడ‌ని అస్స‌లు ఊహించ‌ని అరియానా సునామీని దాచుకున్న సంద్రంలా మాట‌లు మూగ‌బోయి శూన్యంలోకి చూస్తూ నిల‌బ‌డిపోయింది. దీంతో ఆమెను చూసి సోహైల్ భ‌య‌ప‌డిపోయాడు. అలా చూడ‌కు, నాకు భ‌య‌మేస్తుందంటూనే తాను చెప్పాల్సిన కార‌ణాన్ని చెప్పాడు. నువ్వేమైనా చెప్పాల‌నుకుంటే చెప్పు అని అరియానాకు ఆప్ష‌న్ ఇచ్చాడు. కానీ ఆమె మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కాగా సోహైల్‌ ఈ మ‌ధ్యే త‌న‌కు మెహ‌బూబ్‌, అరియానా ఇద్ద‌రూ స‌మాన‌మే అని చెప్పుకొచ్చాడు. మ‌రి ఇంత‌లోనే ఆమెను ఎందుకు నామినేట్ చేస్తున్నాడు? అస‌లు భ‌యంతో నామినేట్ చేశాడా? లేదా? ఈ టామ్ అండ్ జెర్రీ మ‌ళ్లీ గొడ‌వ ప‌డుతున్నారా? అనేది తెలియాలంటే ఇంకొద్ది గంట‌లు ఎదురు చూడక త‌ప్ప‌దు.(చ‌ద‌వండి: సాయంత్రం మ‌ల్లెపూలు తేనా..: అరియానా)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top