ఒక్క‌రోజైనా నిజాయితీగా ఉండు: నోయ‌ల్ ఫైర్‌

Bigg Boss 4 Telugu: Noel Slams Kumar Sai In Task - Sakshi

బిగ్‌బాస్ షోలో నేడు పార్టీ జ‌ర‌గ‌బోతోంది. కానీ ఇది అమ్మాయిలకే స్పెష‌ల్ పార్టీ అని తెలుస్తోంది. అబ్బాయిల‌ను కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే అమ్మాయిలు కండీష‌న్స్ పెడుతున్నారు. దొరికిందే ఛాన్స‌ని వారిని ఆటాడేసుకుంటున్నారు. అయినా స‌రే మాస్ట‌ర్ వ‌ద్దంటున్నా ఆడ‌వాళ్ల పార్టీలో దూరిపోయాడు సోహైల్‌. పోనీ అమ్మాయిలు చెప్పిన‌ట్లు న‌డుచుకున్నాడా అంటే అదీ లేదు.. వారికే కౌంట‌ర్లు వేస్తూ పోయాడు. దీంతో సారీ చెప్ప‌మ‌ని హారిక డిమాండ్ చేసింది. మాస్ ఇక్క‌డ క్ష‌మాప‌ణ‌లు చెప్పేదే లేద‌న్న‌ట్లుగా సోహైల్ ప్ర‌వ‌ర్తించ‌డంతో అంద‌రూ క‌లిసి అత‌డిని ఓ ఆటాడుకున్నారు. హారిక అత‌డి లుంగీ ప‌ట్టుకుని లాగ‌గా దొరికిన వ‌స్తువు అందుకుని చిత‌క‌బాదారు. (డ‌బుల్ ఎలిమినేష‌న్; క‌ళ్యాణి అవుట్‌!)

అఖిల్ పార్టీ రూమ్‌లోకి రాగా సాయంత్రం మల్లెపూలు తేనా అని అరియానా ఓర‌కంట‌తో అడ‌గ్గా అత‌డు సిగ్గుల‌మొగ్గ‌య్యాడు. ఇక ఈ పార్టీ మొద‌లు కావ‌డానికి ముందు కంటెస్టెంట్లు అందరూ పుష‌ప్స్ చేశారు. అయితే కుమార్ సాయి కంటిన్యూగా పుష‌ప్స్ చేయ‌లేద‌ని నోయ‌ల్ అన్నాడు. ఒక్క‌రోజైనా నిజాయితీగా ఉండు అని సూచించ‌డంతో అది త‌ప్పు స్టేట్‌మెంట్ అని కుమార్ ఖండించాడు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు మాత్రం నోయ‌ల్ మాట‌ల‌ను త‌ప్పు ప‌డుతున్నారు. కుమార్ వ్య‌క్తిత్వాన్ని చుల‌క‌న చేసి మాట్లాడ‌టం స‌మంజ‌సం కాద‌ని మండిప‌డుతున్నారు. (బిగ్‌బాస్‌: ఒక‌రు సేఫ్‌, మ‌రొక‌రు నామినేట్‌)

మ‌రికొంద‌రైతే నోయ‌ల్ ఇప్ప‌టికీ ఫేక్‌గానే ఉంటున్నాడ‌ని అత‌డిని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక్క ఆట కూడా ఆడ‌ని నోయ‌ల్ టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే కుమార్‌ని నిందించ‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు మోనాల్ మూడు రోజుల‌వుతున్నా ఇంకా జ్యూట్ డ్రెస్ ధ‌రించ‌డంపై నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసురుతున్నారు. రేపు నాగార్జున ఎదుట ఈ అవ‌తారంలో క‌నిపించే వ‌ర‌కు ఆ డ్రెస్‌ను వ‌దిలేలా లేద‌ని సెటైర్లు వేస్తున్నారు. బిగ్‌బాస్ డీల్స్ ముగిసినా మోనాల్‌కు మాత్రం ఆ డ్రెస్ నుంచి విముక్తి క‌ల్పించ‌డం లేద‌ని మ‌రికొంద‌రు ఆమెను వెన‌కేసుకొస్తున్నారు. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top