గ్లామర్‌తో ట్రెండ్‌ మార్చనున్న వైరల్‌ బ్యూటీ | Bhagyashri Borse upcoming movie plans | Sakshi
Sakshi News home page

గ్లామర్‌తో ట్రెండ్‌ మార్చనున్న వైరల్‌ బ్యూటీ

Apr 12 2026 7:08 AM | Updated on Apr 12 2026 7:32 AM

Bhagyashri Borse upcoming movie plans

ఇతర భాషా నటీమణులు ముఖ్యంగా ఉత్తరాది కథానాయకలకు దక్షిణాదిలో మంచి డిమాండ్‌ ఉంటోంది. అలా చాలా మంది దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మకాం వేస్తున్నారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు అని చెప్పావచ్చు. ఈ మరాఠి బ్యూటీ మిస్టర్‌ బచ్చన్‌  చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీ బోర్సే మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. కారణం చూడగానే ఇట్టే ఆకర్షించే అందం, శరీర ఆకృతి కావచ్చు.  

అయితే స్టార్‌ హీరోల సరసన నటిస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించలేదు. అదే విధంగా తమిళంలోకి కాంత చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించారు. అలా నటించడం వల్లే ఈ అమ్మడికి రావలసిన క్రేజ్‌ రావడం లేదని తెలిసి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్‌. అంటే ఇకపై గ్లామర్‌ విషయంలో కాస్త డోస్‌ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల మాట. 

అందులో భాగంగానే ఈ బ్యూటీ లేటెస్ట్‌గా గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ మోడరన్‌ దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. ఇలాగైనా తన ఫేట్‌ను మార్చుకోవాలని భాగ్యశ్రీ యతి్నస్తున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. ఇకపై ఈ అమ్మడిని మరో కోణంలో చూడబోతున్నామన్న మాట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement