కోరిక తీర్చాలంటూ నటికి వేధింపులు.. కేసు నమోదు! | Banjara Hills Police Filed Case On Casting Artist Booked For Allegedly Sexually Harassing Young Actress | Sakshi
Sakshi News home page

సినిమా అవకాశాలు దక్కాలంటే కోరిక తీర్చాల్సిందే!

Jun 15 2026 10:33 AM | Updated on Jun 15 2026 11:38 AM

Banjara Hills Police Case File Accused Who Harassed Actress

క్యాస్టింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రసాద్‌ వేధించాడని నటి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: సినిమాల్లో నటించినందుకు పారితోషికం ఇవ్వకుండా లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన కాస్టింగ్‌ ఆర్టిస్ట్‌ ప్రసాద్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లికి చెందిన ఒక యువతి(21) సినీనటిగా రాణిస్తోంది. ఓ చిత్రంలో హీరోయిన్‌ స్నేహితురాలి పాత్ర కోసం ప్రసాద్‌ ఆమెను సంప్రదించాడు. అందుకు రూ.90 వేల పారితోషికం ఇస్తామని చెప్పాడు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత తన పారితోషికం పాటు క్యాబ్‌ ఖర్చులు రూ. 30 వేలు ఇవ్వాలని సదరు నటి ప్రసాద్‌ని కోరింది. 

డబ్బుల విషయంమై మాట్లాడడానికి ఫిబ్రవరి 18న సాగర్‌ సొసైటీకీ పిలిపించిన ప్రసాద్‌, ఆమెను బలవంతంగా కారు ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతే మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని వేధించాడు. దీంతో బాధితురాలు తప్పించుకుంది. నటి తల్లి కూడా ప్రసాద్‌ను నిలదీయగా..డబ్బులు ఇచ్చేది లేదని, గతంలోనూ ఇలాగే యువతులను వాడుకొని రూ. 3 కోట్లు సంపాదించానని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement