ఇండస్ట్రీలో పెద్దమనిషి నన్ను చెప్పుతో కొట్టాడు: బండ్ల గణేశ్‌ | Bandla Ganesh Recalls Big Humiliation Incident in Movie Set | Sakshi
Sakshi News home page

Bandla Ganesh: సెట్‌లో చెప్పుతో కొట్టాడు.. ఆ దారుణ అవమానం వల్లే..

May 25 2026 9:58 AM | Updated on May 25 2026 10:45 AM

Bandla Ganesh Recalls Big Humiliation Incident in Movie Set

కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్‌. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు ఇటీవలే రీఎంట్రీ ప్రకటించాడు. చిరంజీవి- బాబీ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు. అలాగే నిర్మాతగానూ సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. తాజాగా నటుడు రాజా రవీంద్ర పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బండ్ల గణేశ్‌ ఒక చేదు సంఘటన తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పుకొచ్చాడు.

ఘోరమైన అవమానం
బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఒక పెద్దమనిషి నన్ను ఎంతో అవమానించాడు. ఆ సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. ఆయన మంచి వ్యక్తే.. కానీ ఆరోజు ఎందుకలా చేశాడో తెలీదు. అయితే ఆయన కోపమే నాకు వరంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ రోజు హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. నేను, ఇంకో యాక్టర్‌ సెట్‌లో సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. 

సారీ చెప్పినా..
నేను ఊరికే కూర్చుని సార్‌.. సార్‌ అని పిలిచినందుకు ఆ పెద్ద మనిషి సడన్‌గా నన్ను చెప్పుతో కొట్టాడు. దేవుడి మీద ఒట్టు.. ఆయన ఏ టెన్షన్‌లో ఉన్నాడో కానీ చెప్పు తీసుకుని కొట్టాడు. రెండు రోజుల తర్వాత సారీరా.. ఏమనుకోకు, వేరేవాళ్ల మీద కోపం నీమీద చూపించాను అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఎంతైనా నేను బలహీనుడిని కాబట్టే కదా నాపై ప్రతాపం చూపించాడు.

ఛాలెంజ్‌
ఆరోజు ఆయనలా కొట్టిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేశే కాదు అని నాకు నేనే సవాల్‌ విసురుకున్నాను. అలా నా జీవితాన్ని మార్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే బండ్ల గణేశ్‌ తక్కువకాలంలోనే సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా రాణించి కోట్లు కూడబెట్టాడు.

చదవండి: మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్‌?

Advertisement
 
Advertisement
Advertisement