ఎన్నేసి ఫెస్టివల్‌లో బాహుబలి: ద ఎటర్నల్‌ వార్‌  | Baahubali animation film selected for Annecy Film Festival in France | Sakshi
Sakshi News home page

ఎన్నేసి ఫెస్టివల్‌లో బాహుబలి: ద ఎటర్నల్‌ వార్‌ 

Apr 16 2026 4:40 AM | Updated on Apr 16 2026 4:40 AM

Baahubali animation film selected for Annecy Film Festival in France

‘బాహుబలి: ది బిగినింగ్‌’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ (2017) చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సినిమా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో 2025 అక్టోబరు 31న రిలీజ్‌ చేశారు. తాజాగా ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రానున్న సరికొత్త యానిమేషన్‌ చిత్రం ‘బాహుబలి: ద ఎటర్నల్‌ వార్‌’. ఈ మూవీకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

ఇషాన్‌ శుక్లా దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ చిత్రం ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఎన్నేసి యానిమేషన్‌ ఫెస్టివల్‌ 2026’లోని ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు రాజమౌళి. ‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్‌ వేదికపై ‘బాహుబలి: ద ఎటర్నల్‌ వార్‌’ని ప్రదర్శించే అవకాశం రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మన భారతీయ సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement