తండ్రిని తలుచుకొని ఎమోషనల్‌ అయిన సురేఖవాణి కూతురు

Artist Surekha Vani Daughter Reveals About Her Father Death In Live - Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. గత కొంతకాలంలో ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకుంటున్నారు. ఇక వీడియోలో ఎంతో చలాకీగా కనిపించే సురేఖ-సుప్రీత నిజ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. సురేఖ వాణి భర్త సురేశ్‌ తేజ అనారోగ్యంతో 2019లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన సుప్రీత నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

ఈ సందర్భంగా తండ్రితో తనకున్న అనుబంధం ఏంటి? అసలు ఆయన ఎలా చనిపోయారని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా, తనకు, తన తండ్రికి చాలా మంచి రిలేషన్‌ ఉండేదని,  నాన్నతో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని అని సుప్రీత చెప్పుకొచ్చింది. ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకునేవాళ్లం అని తెలిపింది. ఇక తండ్రి మరణంపై మాట్లాడుతూ..నాన్నకి ఎక్కువగా నడిచే అలవాటు ఉండేది. ఓసారి ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదిస్తే..ఇన్‌ఫెక‌్షన్‌ అయ్యిందని, సర్జరీ చేసి కాలి వేళ్ల వరకు తీసేద్దామని చెప్పారు.

సర్జరీ జరిగింది. కానీ కొన్నాళ్లకు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అయ్యింది. దీంతో మళ్లీ సర్జరీకి వెళ్లాం. ఆ సమయంలో ఓసారి ఆయనకు హార్ట్‌ అటాక్‌ వచ్చింది. అయితే సర్జరీ వళ్లే గుండెనొప్పి వచ్చిందని చెప్పలేను కానీ సడెన్‌గా ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారు అంటూ సుప్రీత ఎమోషనల్‌ అయ్యింది. ఇక అటు సురేఖవాణితో పాటు సుప్రీతకు సైతం సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే పెరిగింది. దీంతో త్వరలోనే వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. 

చదవండి : నా జీవితంలో చెత్తరోజు..సురేఖ వాణి కూతురు ఎమోషనల్‌ పోస్ట్‌
పిచ్చిదానిలా ఉన్నా..నీకు హాట్‌గా కనిపించానా : నటి హేమ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top