
‘‘మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ‘మదరాసి’ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఈ మూవీలో హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు విలన్. అందుకే టైటిల్ ‘మదరాసి’ అని పెట్టాను’’ అని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెలిపారు. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జోడీగా విద్యుత్ జమాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదరాసి’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో మురుగదాస్ మాట్లాడుతూ– ‘‘వెస్ట్రన్ కంట్రీస్‌లో ఇప్పటికే ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ‘మదరాసి’ కథ రాశాను. ఈ కథ మొత్తం తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అయినప్పటికీ ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. ఈ కథ చెప్పిన వెంటనే శివ కార్తికేయన్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకు మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది.
విద్యుత్ జమాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. అయితే ‘మదరాసి’ కథ నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ ఎన్వీ ప్రసాద్‌గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. దక్షిణాది ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రస్తుతం మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుండటం సంతోషం. ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ, చివరకు అది పట్టాలెక్కలేదు. అందువల్లే దాదాపు ఐదేళ్లు గ్యాప్ వచ్చింది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు.