వరుణ్‌ ధావన్‌ షాకింగ్‌ లుక్‌, అనిల్‌ కపూర్‌ స్పందన!

Anil Kapoor Reacts On Varun Dhawan Shocking Look Goes Viral - Sakshi

ప్రస్తుతం యంగ్‌ హీరోలంతా సినిమాల్లో తమ లుక్‌ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఏవేవో ప్రమోగాలు చేస్తుంటారు. అలా డిఫరెంట్‌ లుక్స్‌తో అందరికి షాక్‌ ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తన తాజా లుక్‌తో సూపర్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ను ఆశ్చర్యపరిచాడు. భారీగా కండలు పెంచేసి షర్ట్‌ లేకుండా దిగిన మూడు ఫొటోలను షేర్‌ చేశాడు. ఇలా వరుణ్‌ను చూసిన సెలబ్రెటీలు, అభిమానులు అతడి శరీర సౌష్టవంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇ​క అనిల్‌ కపూర్‌ దీనిపై స్పందిస్తూ ‘టెర్రిఫిక్‌’ అంటూ తనదైన శైలిలో కామెంట్స్‌ చేశాడు. ​ప్రస్తుతం వరుణ్‌కు సంబంధించిన ఈ ఇన్‌స్టా పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా వరుణ్‌ తన తాజా చిత్రం ‘బేడియా’ కోసం భారీగా కండల పెంచాడట. హరర్‌ కామెడీ నేపథ్యంలో తెరక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్‌ సరసన కృతీ సనన్‌ నటిస్తోంది. కరోనా సమయంలో కూడా ఈ మూవీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో షూటింగ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top