యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే! | Anchor Rashmi Gautam Marriage Rumours With Odisha Businessman Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anchor Rashmi Marriage Rumours: బిజినెస్‌మ్యాన్‌తో రష్మీకి పెళ్లంటూ రూమర్స్.. నిజమేనా?

Published Sun, Nov 26 2023 6:06 PM

Anchor Rashmi Marriage Rumours With Odisha Businessman - Sakshi

యాంకర్ రష్మీ.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది పక్కనబెడితే.. స్క్రీన్‌పై కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్. కలిసి ఏ షోలో కనిపించినా సరే టీఆర్పీలు దూసుకెళ్తాయి. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కచోట కనిపించి చాలా కాలమైంది. అలానే ఇద్దరూ(వేర్వేరుగా) ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ పెళ్లి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)

ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయి రష్మీ. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే కామెడీ షోకి యాంకర్ అయ్యిందో ఈమె ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే ఒకటి రెండు షోలకు యాంకరింగ్ తప్పితే వేరే ప్రాజెక్టులు ఏం చేయట్లేదు.

అలానే రష్మీ వయసు కూడా 35 ఏళ్లు. అయితే ఈమెకి ఇదివరకే పెళ్లయిందని అని అన్నారు గానీ అందులో ఎంత నిజముందనేది తెలియదు. తాజాగా మరోసారి అలాంటి పుకారు వచ్చింది. ఒడిశాకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఈమెకు పెళ్లి కానుందిని, ఇది పెద్దల కుదిర్చిన సంబంధమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటిలానే ఇది నిజం కాదని సుధీర్ ఫ్యాన్స్ అంటున్నారు. రష్మీ స్వయంగా స్పందిస్తే తప్పితే దీనిపై ఓ క్లారిటీ రాదు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!)

Advertisement
 
Advertisement