భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్‌ రష్మీకి ఆపరేషన్‌ | Anchor Rashmi Gautam Hospitalised, Underwent to Operation | Sakshi
Sakshi News home page

Rashmi Gautam: రక్తస్రావం, నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ.. ఆపరేషన్‌ జరిగిందంటూ..

Apr 20 2025 12:25 PM | Updated on Apr 20 2025 1:34 PM

Anchor Rashmi Gautam Hospitalised, Underwent to Operation

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. కొద్దినెలలుగా ఆమె రక్తస్రావం, భుజం నొప్పి సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన రష్మీకి ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. జనవరి నుంచి నాకు ఎప్పుడుపడితే అప్పుడు రక్తస్రావం అవుతోంది. దీనికి తోడు భుజం నొప్పితో విలవిల్లాడాను. ముందుగా దేనికి చికిత్స తీసుకోవాలో అర్థం కాలేదు.

రెండు రోజుల క్రితమే ఆపరేషన్‌
ఇంతలో శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయి 9కి పడిపోయింది. మార్చి 29న శరీరం నా కంట్రోల్‌లో లేకుండా పోయింది. పూర్తిగా నీరసించిపోయాను. కానీ అంతకుముందే కొన్ని ప్రాజెక్టులకు డేట్స్‌ ఇచ్చిన కారణంగా నా పని పూర్తి చేసుకున్నాకే ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టాను. ఏప్రిల్‌ 18న ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను. మూడువారాలపాటు విశ్రాంతి తీసుకుంటాను. 

ఆపరేషన్‌ ముందు ఇలా..
తర్వాతే మళ్లీ సెట్స్‌లో అడుగుపెడతాను. ఈ సమయంలో నాకు సాయం చేసిన డాక్టర్లకు, తోడుగా నిల్చున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లడానికి ముందు.. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యాక దిగిన ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఇది చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement