సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్.. వినోదం ఇక మాక్సిమమ్..! | AMB Classic Victory Imax Theatre in sudharshan 70mm in Hyderabad | Sakshi
Sakshi News home page

Imax Theatre: హైదరాబాద్‌లో ఐమ్యాక్స్.. ఎక్కడో తెలుసా?

Jun 1 2026 5:09 PM | Updated on Jun 1 2026 5:16 PM

AMB Classic Victory Imax Theatre in  sudharshan 70mm in Hyderabad

హైదరాబాద్‌ సినీ ప్రియులకు బిగ్‌ గుడ్ న్యూస్‌ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్‌ థియేటర్‌ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్‌లో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క ఐమ్యాక్స్ థియేటర్‌ కూడా అందుబాటులో లేదు. ఏఎంబీ క్లాసిక్‌ విక్టరీ ఏర్పాటు సినీ ప్రియుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ ఏడాదిలోనే ఐమ్యాక్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement