Amala Paul: నేరుగా ఓటీటీకి సంచలన నటి అమలా పాల్‌ చిత్రం

Amala Paul Cadaver Movie Releasing On OTT Platform Disney Plus Hotstar - Sakshi

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రాని పరిస్థితి. స్టార్‌ నటులు లేదా చిత్రం ఎంతో బాగుంటే మాత్రమే థియేటర్‌లోకి వస్తున్నారు. ఇటీవల అలాంటి చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. దీంతో నిర్మాతలు సేఫ్‌ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే ఓటీటీ ప్లాట్‌ఫారం. నిజం చెప్పాలంటే ఇది చిన్న నిర్మాతలకు వరంగా మారింది. దీంతో థియేటర్‌లో చిత్రాలను విడుదల చేసి అవి హిట్‌ అవుతాయో లేదో అని టెన్షన్‌ పడుతూ ప్లాప్‌ అయితే పెట్టిన పెట్టుబడి పోగొట్టుకోవడం కంటే ముందుస్తు జాగ్రత్తలతోనే పడుతున్న నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఆశ్రయిస్తున్నారు.

చదవండి: పొన్నియన్‌ సెల్వన్‌ నుంచి ఫస్ట్‌సాంగ్‌ అవుట్‌.. ఆకట్టుకుంటున్న లిరిక్స్‌

ఇక సంచలన నటి అమలాపాల్‌ విషయానికొస్తే చాలా కాలంగా తెరపై కనిపించడం లేదు. అలాంటిది ఈమె నిర్మాతగా మారి ‘కడావర్‌ పేరుతో చిత్రాన్ని నిర్మించింది. అంతేకాదు ఈ మూవీలో ఆమె ప్రధాన పాత్రలో కూడా నటించింది. మలయాళ దర్శకుడు అనూప్‌ ఎస్‌.పణికర్‌ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు హరీష్‌ ఉత్తమన్, మునీష్‌ కాంత్, పశుపతి, నిళల్‌గళ్‌ రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మెడికల్‌ క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అమలాపాల్‌ పోలీసుగా నటించింది. ఒక కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ కేసును ఏసీపీతో కలిసి ఈమె ఎలా చేధించింది అన్నదే చిత్ర కథాంశం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్ట్‌ 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top