HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కి మద్ధతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ | Allu Arjun Fans Association Supports HPV Vaccine Drive | Sakshi
Sakshi News home page

Allu Arjun Fans Asscoiation: మంచి పనిచేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Apr 1 2026 2:32 PM | Updated on Apr 1 2026 2:40 PM

Allu Arjun Fans Association Supports HPV Vaccine Drive

హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA).. హెచ్ పీవీ(HPV Vaccine) వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ అసోసియేషన్.. ఏడాది మొత్తం హెచ్ పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలని అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇతడి అభిమాన సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు.. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్-‍అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)

9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్‌ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం.. స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం మంచి విషయం అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?)

Advertisement
 
Advertisement
Advertisement