అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్‌కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్‌కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


