ఆ సినిమాతో పోల్చడం సంతోషం | Allu Aravind Comments On Nikhil Siddharth At 18 Pages Success Meet | Sakshi
Sakshi News home page

ఆ సినిమాతో పోల్చడం సంతోషం

Dec 30 2022 5:31 AM | Updated on Dec 30 2022 5:31 AM

Allu Aravind Comments On Nikhil Siddharth At 18 Pages Success Meet - Sakshi

‘‘ఫీల్‌ గుడ్‌ సినిమా ఆడదు.. ప్రేమ కథలు ఇంటికి (ఓటీటీ) వచ్చినప్పుడు చూద్దాంలే’ అని ప్రేక్షకులు అను కుంటున్న తరుణంలో ‘సీతారామం’ వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లయిమాక్స్‌కి ఉన్న ఫీలింగ్‌ మా ‘18 పేజెస్‌’కి వచ్చిందని చాలామందిపోల్చి చెబుతుంటే సంతోషంగా ఉంది. మా సినిమా చూస్తే ఒక నవలను చదివిన అనుభూతి కలిగేలా దర్శకుడు మలిచాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. నిఖిల్‌ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా సూర్య ప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘18 పేజెస్‌’. డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘మా సినిమా మొదటిరోజు వసూళ్ల కంటే మూడో రోజు ఎక్కువ ఉన్నాయి. ఈ చిత్రం విషయంలో మేం లాభాల్లో ఉన్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసినవారు ‘మాకు మేమే ప్రేమలో పడిన అనుభూతి వస్తోంది’ అంటున్నారు. అది మాకు పెద్ద ప్రశంస’’ అన్నారు సూర్యప్రతాప్‌. ‘‘2022లో టాప్‌ ఫైవ్‌ లవ్‌ స్టోరీస్‌లో మా ‘18 పేజెస్‌’ ఉంటుంది. కెరీర్‌ వైజ్‌గా నా జీవితంలో ఇది బెస్ట్‌ ఇయర్‌’’ అన్నారు నిఖిల్‌. ‘‘శతమానం భవతి’లో నేను చేసిన నిత్య ΄ాత్రకి ఎంత మంచి పేరొచ్చిందో ‘18 పేజెస్‌’లో నందిని ΄ాత్రకి కూడా అంతే పేరొచ్చింది’’ అన్నారు అనుపమ.  
∙ నిఖిల్, అనుపమ, అల్లు అరవింద్, బన్నీ వాసు, సూర్యప్రతాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement