Ajith Appeal Fans And Media Do Not Write Thala Or Other Prefix Before His Name - Sakshi
Sakshi News home page

Ajith: మీడియా, పబ్లిక్‌, ఫ్యాన్స్‌కు అజిత్‌ విజ్ఞప్తి, అభిమానుల ఆందోళన

Dec 1 2021 4:35 PM | Updated on Dec 1 2021 5:49 PM

Ajith Appeal Fans And Media Do Not Write Thala Or Other Prefix Before His Name - Sakshi

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోను ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఎక్కువే. అజిత్ కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ హీరోగ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్‌. అయితే అజిత్‏ను ఆయన అభిమానులు ముద్దుగా ‘తల’ అని పిలుచుకుంటుంటారు.

చదవండి: విక్కీ-కత్రినా పెళ్లిలో సెల్‌ఫోన్ల బ్యాన్‌పై నటుడు స్పందన, పోస్ట్‌ వైరల్‌

అంతేగాక మీడియా సైతం ఆయన పేరుకు ముందు ‘తల’ అని సంభోదిస్తుంది. ‘తల’ అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ మీడియా, పబ్లిక్‌, తన ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇకపై తనను తల అని పిలవోద్దని మీడియా, పబ్లిక్‌, ఫ్యాన్స్‌ను కోరారు. ఈ మేరకు అజిత్‌ మేనేజర్‌ సురేశ్‌ చంద్ర ట్విటర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. గౌరవనీయమైన మీడియా సభ్యులకు, ప్రజానీకానికి, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు.

చదవండి: మనసుకు బాధగా ఉంది మిత్రమా: ఇళయరాజా భావోద్వేగం

అదేంటంటే.. ‘ఇకపై ఎవరూ కూడా నన్ను ‘తల’ అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని  మాత్రమే పిలవండి.  మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి కారణమేంటో​ వెల్లడించలేదు. దీంతో అజిత్‌ ఈ ప్రకటన ఇవ్వడం వెనక అంతర్యం ఏంటి, ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement