
వచ్చే ఈద్ పండక్కి బాక్సాఫీస్ ఫైట్‌కి సై అంటున్నారు అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాల్ 4’. రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ మిశ్రా, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, అశోక్ థాకరియా నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండక్కి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఇక మరోవైపు ‘లవ్ అండ్ వార్’ సినిమాను ఈద్ పండగ సందర్భంగా 2026 మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలోనే వెల్లడించారు ఈ చిత్రదర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరి... బాక్సాఫీస్ వద్ద వచ్చే ఈద్‌కి రణ్‌బీర్‌ది పై చేయి అవుతుందా? లేక అజయ్ దేవగణ్ హిట్ అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.