యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) తొలిసారిగా కలిసి నటించిన చిత్రం తీయవర్ కులై నడుంగ. తెలుగులో మఫ్టీ పోలీస్‌గా రిలీజ్ కానుంది. జీఎస్ ఆర్ట్స్ పతాకంపై జీ.అరుళ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్ ఫేమ్ అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా, లోగు, రామ్ కుమార్, తంగదురై, బేబీ అనికా, ప్రాంక్ట్సర్ రాహుల్, ప్రియదర్శిని, జీకే రెడ్డి, పీఎల్ తేనప్పన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ నెలలోనే రిలీజ్
ఈ చిత్రానికి భరత్ ఆశీగన్ సంగీతం, శరవణన్ అభిమన్యు చాయాగ్రహణం అందించారు. యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబర్ 21వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. చట్టాన్ని మించి న్యాయం ఉంటుందని, న్యాయాన్ని మించి ధర్మం ఉంటుందని, చివరికి గెలిచేది ధర్మమేనని చెప్పే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రివ్యూ


