
ఇప్పటి వరకు ఆహా నుంచి వచ్చిన ఒరిజినల్స్, షోస్, సిరీస్ ఇలా అన్నీ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌నే అందించాయి. ఈసారి మేం సరిహద్దులను మరింతగా విస్తరించాలనుకుంటున్నాం.
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈసారి వినూత్నంగా ఓ కొత్త సీరియల్‌తో ముందుకు వచ్చింది. మిష్టర్ పెళ్లాం అనే డెయిలీ తెలుగు సిరీస్‌ను ప్రారంభించింది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సీరియల్ ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు మధ్యాహ్నం రెండు గంటలకు రోజుకో ఎపిసోడ్‌తో వ్యూయర్స్‌ను అలరించనుంది. అన్ని ఎపిసోడ్లను ఉచితంగా చూసేయొచ్చని ఆహా తెలిపింది. ఈ సందర్భంగా ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు ఆహా నుంచి వచ్చిన ఒరిజినల్స్, షోస్, సిరీస్ ఇలా అన్నీ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌నే అందించాయి. ఈసారి మేం సరిహద్దులను మరింతగా విస్తరించాలనుకుంటున్నాం. డెయిలీ సిరీస్‌లను ఇష్టపడి ఆదరించే మహిళల కోసం మిష్టర్ పెళ్లాం సిరీస్‌ను సిద్ధం చేశాం' అన్నారు.
‘మిష్టర్ పెళ్లాం’ డెయిలీ సిరీస్ భవ్య (పూజా మూర్తి), నివాస్ (అమర్ దీప్), రేఖ (సోనియా) అనే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ. పెళ్లి కోసం కలలు కంటూ తనను తనలాగా ప్రేమించే భర్త కోసం భవ్య కలలు కంటుంటుంది. నివాస్ ధనవంతురాలిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలనుకుంటాడు. భవ్య దగ్గర పని చేసే రేఖ డబ్బులను పట్టించుకోకుండా అపరిమితమైన ప్రేమ చూపించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది. ఈ ముగ్గురు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచింది. విధి ఆడిన నాటకంలోని ట్విస్టులతో ముగ్గురు ఒకరితో ఒకరు ముడిపడతారు. భవ్య, రేఖ నిజంగానే వారు కోరుకుటన్నట్లు నిజమైన ప్రేమను పొందుతారా? వీరి ప్రయాణాన్ని వీక్షించాలనుకుంటే ఆహాకు ట్యూన్ కావాల్సిందే.
చదవండి: టికెట్ టు ఫినాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరో తెలుసా?
సమంత కండీషన్ సీరియస్; నిజమేంటంటే?