'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి కోలుకున్న మారుతి.. పోస్ట్ వైరల్ | After Raja Saab Movie Failure Director Maruthi Next Update | Sakshi
Sakshi News home page

Director Maruthi: తర్వాత సినిమా అప్‌డేట్ ఇచ్చిన మారుతి

Mar 27 2026 2:11 PM | Updated on Mar 27 2026 2:38 PM

After Raja Saab Movie Failure Director Maruthi Next Update

ఈ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచిన సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్స్ చూసి, దర్శకుడు మారుతి మాటల్ని నమ్మి.. అభిమానులు హైప్ పెంచేసుకున్నారు. తీరా చూస్తే వాళ్లని దారుణంగా మోసం చేశారు! కంటెంట్ ఓ మాదిరిగా ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్, హెడ్ మార్పింగ్ లాంటివి మరీ ఎక్కువగా ఉండేసరికి చాలామంది ఇప్పటికీ మారుతిని విమర్శిస్తూనే ఉన్నారు. అలా గత కొన్నేళ్లుగా బయట కనిపించని మారుతి.. చాన్నాళ్లకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన కొత్త మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చాడు.

(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)

శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పిన దర్శకుడు మారుతి.. ప్రతి ప్రయాణం ఓ అనుభవమే అని 'రాజాసాబ్' ఫెయిల్యూర్‌ని గుర్తుచేసుకున్నాడు. తన కొత్త మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దీనిపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలబడిన మీడియా, సన్నిహితులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

చూస్తుంటే 'రాజాసాబ్' ఫ్లాప్ నుంచి మారుతి కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అయితే ఇతడి తర్వాతి సినిమాకు 'హ్యాపీ పొంగళ్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు, మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్‌తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ చిత్రంతో మారుతి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి. లేదంటే మాత్రం కష్టమే!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement