‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు | Adiparvam Movie Censor Reports | Sakshi
Sakshi News home page

‘ఆదిపర్వం’ పై సెన్సార్ సభ్యులు ప్రశంసలు

May 22 2024 2:52 PM | Updated on May 22 2024 2:52 PM

Adiparvam Movie Censor Reports

ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి.  1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు "అన్విక ఆడియో" ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.


దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన "ఆదిపర్వం" అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అన్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement