రోహిత్‌ జర్నీని అద్భుతంగా చూపించిన బిగ్‌బాస్‌, ఆదిరెడ్డి ఒక్క అడుగు దూరంలో.. | Adi Reddy And Rohit 100 Days Journey In Bigg Boss 6 Telugu | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రోహిత్‌ జర్నీని అద్భుతంగా చూపించిన బిగ్‌బాస్‌, ఆదిరెడ్డి ఒక్క అడుగు దూరంలో..

Dec 14 2022 9:09 AM | Updated on Dec 14 2022 10:24 AM

Adi Reddy And Rohit 100 Days Journey In Bigg Boss 6 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 చివరి అంకానికి చేరుకుంది. గ్రాండ్‌ ఫినాలేకు అతి దగ్గర్లో ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు హౌస్‌లో తమ జర్నీ వీడియోలను చూపించాడు. ఇప్పటికే రేవంత్‌, సత్యల జర్నీ వీడియోలు చూశాం. ఇప్పుడు ఆదిరెడ్డి, రోహిత్‌ల జర్నీ ఎలా ఉంది? బిగ్‌బాస్‌ చేసిన రివ్యూ ఏంటి అన్నది చదివేద్దాం.

ఆదిరెడ్డి జర్నీ గురించి బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. ''కామన్‌మ్యాన్‌గా ఇంట్లోకి అడుగుపెట్టి ప్రతి అంశంలో నిశితంగా చూడగలిగడం ఆటలో ఒక అడుగు ముందుంచింది. కొన్నిసార్లు మీ అంచనా తప్ప మీకే నష్టం జరిగింది. .మీలోని రివ్యూవర్‌ని కాకుండా ఒక సామాన్యుడ్ని కొన్ని సార్లు బయటపెట్టారు. అది అందరినీ ఆకట్టుకుంది. మీరు చేసిన డాన్స్ కూడా అందులో ఒకటి.మాట పడని స్వభావం.. మాట ఎలా అనాలో తెలిసిన తనం మీకు మాత్రమే సొంతం. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం కూడా ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్'' అంటూ జర్నీని ముగించారు. 

హౌస్‌లో చివరగా రోహిత్‌ జర్నీని చూపించాడు బిగ్‌బాస్‌. భార్య మెరీనా ఫోన్‌ కాల్‌తో ఫుల్‌ ఖుషీ అయిన రోహిత్‌కు ఆ తర్వాత బిగ్‌బాస్‌ వంద రోజుల జర్నీని చూపించాడు. ఇక రోహిత్‌ గురించి బిగ్‌బాస్‌ అద్భుతంగా చెప్పారు. ''భార్య భర్తలుగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఏ ప్రయాణంలోనైనా ఎదురయ్యే సవాళ్లు, ఏర్పడే పరిస్థితుల కారణంగా వచ్చే కష్టసుఖాలు పంచుకోవడం కేవలం జీవిత భాగస్వామితోనే సాధ్యమవుతుంది. ఆ తోడు మీకు ఈ ఇంట్లో లభించింది. ఇదే విషయం గురించి ఇంట్లోవాళ్లు మిమ్మల్ని తరచూ నామినేట్‌ చేస్తున్నప్పుడు మీ మనసుకి బాధ కలిగింది. స్నేహితులు జట్టుగా ఆడితే తప్పు కానప్పుడు మీరు ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యిందో అర్థం కాలేదు.

భార్యభర్తలకు మించిన స్నేహితులుంటారా? అనే భావన కలిగింది. అయినా మీరు అవేం లెక్కచెయ్యలేదు. మీ సహనాన్ని కోల్పోలేదు. మీ మంచితనాన్ని అవకాశంగా ఇతరులు తీసుకున్నా, మీరు వారికి మంచి చేయడానికే నిర్ణయించుకున్నారు. మీ అమ్మగారు మిమ్మల్ని కెప్టెన్‌గా చూడాలనే కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయినా ఈ స్థానంలో మిమ్మల్ని ఇలా చూసి గర్వపడతారు'' అంటూ రోహిత్‌ గురించి అద్భుతంగా మాట్లాడారు. ఈ జర్నీ వీడియోతో రోహిత్‌ విన్నర్‌ మెటీరియల్‌ అనేంత పాజిటివ్‌గా చూపించారు. మిగతా ఇంటిసభ్యుల కంటే రోహిత్‌ జర్నీ వీడియో చాలా ఇంప్రెసివ్‌గా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement