హీరోయిన్‌ ఇంట పెళ్లి సంబరాలు.. | Actress Rajisha Vijayan Sister Anjusha Getting Married | Sakshi
Sakshi News home page

Rajisha Vijayan: నువ్వెప్పటికీ నా కుందనపు బొమ్మవే.. హీరోయిన్‌ పోస్ట్‌

May 25 2026 12:09 PM | Updated on May 25 2026 12:09 PM

Actress Rajisha Vijayan Sister Anjusha Getting Married

మలయాళ హీరోయిన్‌ రజిషా విజయన్‌ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే! రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీలో రజిషా కథానాయికగా నటించింది. తెలుగులో డబ్‌ అయిన కర్ణన్‌, జై భీమ్‌, సర్దార్‌, బైసన్‌ వంటి చిత్రాలతోనూ ఇక్కడ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సర్దార్‌ 2లో నటిస్తోంది. తాజాగా తను ఓ శుభవార్త చెప్పింది. 

హీరోయిన్‌ ఇంట పెళ్లి వేడుక
తన సోదరి అంజూష పెళ్లిపీటలెక్కినట్లు వెల్లడించింది. అచ్యుతన్‌ సురేశ్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లికూతురితో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కళ్లు మూసి తెరిచేలోపే నా చిన్నపాప పెళ్లికూతురైపోయింది. నువ్వెప్పటికీ నా కుందనపుబొమ్మవే.. అని క్యాప్షన్‌ ఇచ్చింది.

కెరీర్‌
కేరళకు చెందిన విజయన్‌- షీల దంపతుల కూతుర్లే రజీషా, అంజుషా. రజీషా విజయన్‌ టీవీ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. అనురాగ కరిక్కిన్‌ వేళ్లం చిత్రంతో మలయాళ వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీకిగానూ ఉత్తమనటిగా కేరళ ఫిలిం అవార్డు గెలుచుకుంది. జూన్‌, కళంకావల్‌, మస్కిష్క మరణం.. ఇలా మలయాళంలో అనేక సినిమాలు చేసింది.

 

 

చదవండి: ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా నాతోపాటు విజయ్‌ ప్రాణాలు పోయేవి: విలన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement