గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. గుర్తుపట్టారా? | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయిన స్టార్‌ హీరోయిన్‌.. గుర్తుపట్టారా?

Published Fri, Feb 16 2024 10:38 AM

Actress Nagma Look Now Chubby - Sakshi

మహారాష్ట్రకు చెందిన నగ్మ 'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. 90వ దశకంలో ఆమె నటనకు, అందానికి యూత్‌ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్‌ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్‌గా రాణించింది.

కానీ ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. కానీ ఎప్పుడు సుమారు పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో కనిపించిన నగ్మ తర్వాత  ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్లు కాగా ఇప్పుడు ఆమెను చూడగానే గుర్తుపట్టడం కాస్త కష్టం అని చెప్పవచ్చు. బాగా బొద్దుగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఒంటరిగానే నగ్మ ఉంటుంది.

కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది. జ్యోతిక, రోషిణిలకు నగ్మా సోదరి అనే విషయం తెలిసిందే.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement