పెళ్లయ్యాక సినిమాలకు దూరం.. విడాకుల తర్వాత రీఎంట్రీ | Actress Bhama Birthday: Marriage, Divorce, Re Entry | Sakshi
Sakshi News home page

తెలుగులో ఒకే ఒక్క సినిమా.. ఈ హీరోయిన్‌ అసలు పేరేంటంటే?

May 23 2026 3:37 PM | Updated on May 23 2026 3:43 PM

Actress Bhama Birthday: Marriage, Divorce, Re Entry

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం సాగించినవారిలో హీరోయిన్‌ భామ ఒకరు. ఈమె అసలు పేరు రేఖిత ఆర్‌.కురుప్‌. నేడు (మే 23న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

టీవీ నుంచి వెండితెరపైకి..
కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగింది భామ. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై మెరిసింది. సూర్య టీవీ ఛానల్‌లో తాళి అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తర్వాత ఓ ఆల్బమ్‌లోనూ యాక్ట్‌ చేసింది. సరిగ్గా అదే సమయంలో మలయాళ దర్శకుడు లోహితదాస్‌ ఆమెను చూశాడు. నివేద్యం సినిమాతో భామను కథానాయికగా పరిచయం చేశాడు. 

తెలుగులోనూ..
ఫస్ట్‌ సినిమా క్లిక్‌ అవడంతో భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. అదే సమయంలో ఎల్లం అవన్‌ సేయల్‌ ద్వారా తమిళంలో, మొదలశాలతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మంచివాడు (2011) అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. తనలో మంచి సింగర్‌ కూడా దాగుంది.

సింగిల్‌ మదర్‌గా..
2020లో వ్యాపారవేత్త అరుణ్‌ జగదీశ్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది. ఇంతలోనే ఈ జంటకు కూతురు గౌరి పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. ప్రస్తుతం భామ సింగిల్‌ పేరెంట్‌గా కూతురిని పోషిస్తోంది. గతేడాది (2025) సుమతి వలవు చిత్రంతో సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

చదవండి: భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి

Advertisement
 
Advertisement
Advertisement