60 లక్షల అభిమానం

వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకునేందుకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఓ చక్కని వేదిక. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్... ఇలా పలు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు నటీనటులు. వీరిని ఫాలో అయ్యేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. తాజాగా మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు మిలియన్ల ఫాలోయర్లను (60 లక్షలు) సంపాదించుకున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘యువర్స్ ట్రూలీ మహేశ్’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే 60 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు మహేశ్‌బాబు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి