రహదారి వెంట జీడీ వనమే.. | - | Sakshi
Sakshi News home page

రహదారి వెంట జీడీ వనమే..

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

మొక్కలు నాటిన గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట– సిద్దిపేట మధ్య నూతనంగా నిర్మించిన 765 డీజీ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో పాటు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, పాఠశాలల విద్యార్థులతో కలిసి జీడి మామిడి మొక్కలు నాటారు. ఈమేరకు 43 కిలోమీటర్ల మేర 35 వేల మొక్కలు నాటనున్నట్లు ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. నాటిన మొక్కల సంరక్షణకు డ్రిప్‌ సిస్టం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మొక్కలు నాటిన అనంతరం జరిగిన సమావేశంలో గవర్నర్‌తోపాటు ఎంపీ రఘునందన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానకిశోర్‌ ఎమ్మెల్సీ కొమురయ్య పాల్గొన్నారు. గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన అనంతరం మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా గవర్నర్‌ పర్యటనకు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన రాక సందర్భంగా పట్టణంలోని సిద్దిపేట దారిలో వ్యాపార సంస్థలను మూసివేయించారు. గవర్నర్‌ మొక్కలు నాటుతున్న సమయంలో రోడ్డును ఇరువైపులా మూసి వేయించారు. సభకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలతోపాటు ప్రజలు తరలివచ్చారు. అనంతరం గవర్నర్‌ను ఎంపీ సన్మానించారు. గవర్నర్‌ పర్యటన సందర్భంగా పోలీసుల అత్యుత్సాహంతో మీడియా మిత్రులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement