వన్యప్రాణులను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులను సంరక్షించాలి

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

కొల్చారం(నర్సాపూర్‌): వన్యప్రాణుల సంరక్షణ, అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని కౌడిపల్లి అటవీ రేంజ్‌ అధికారి రవీందర్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల వేడుకల్లో భాగంగా అటవీ రేంజ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజ్‌ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ.. భూమిపై ఉన్న ప్రతి జీవికి ప్రకృతిలో ప్రత్యేక స్థానం ఉందని, వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. అడవుల నరికివేత వల్ల వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతినకుండా వాటి కారిడార్లను రక్షించాలన్నారు. అడవులు, పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాపాడాలని కోరారు. సదస్సులో డిప్యూటీ రేంజ్‌ అధికారి పృథ్వీరాజ్‌, సెక్షన్‌ అధికారులు మల్లేశ్‌, ఓం ప్రకాశ్‌, బీట్‌ అధికారులు ధనలక్ష్మి, గబ్బర్‌సింగ్‌, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

కౌడిపల్లి అటవీ రేంజ్‌ అధికారి రవీందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement