మెదక్ కలెక్టరేట్: ‘సర్’ ప్రక్రియను తక్షణమే రద్దు చేయడంతోపాటు నిరంకుశ ధోరణితో పని చేస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను భర్తరఫ్ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను తీవ్రంగా ఖండించారు. సర్ పేరుతో దేశంలో అనేక మంది ఓట్లను తొలిగించేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం సర్ పేరుతో జరుగుతున్న బీజేపీ కుట్రలను ఎండగడతామన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మల్లేశంగౌడ్, రాగి అశోక్, మల్లేశం, భూపతిరాజు, మహిపాల్ రెడ్డి, లక్ష్మి, సీపీఎం నాయకులు ఏ.మల్లేశం, బాలమణి, బాబు, షౌకత్, దుర్గ, వెంకట్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.


