● సరఫరాకు ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్
● జిల్లా వ్యాప్తంగా 1,728 నీటి వనరులు
● 17 వేల పైచిలుకు మత్స్యకారులకు లబ్ధి
చేపల పెంపకంపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. జిల్లాలో కాస్త ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ చేపలను పెంచేందుకు సరిపడా నీళ్లు చెరువులకు చేరాయి చేరాయి. ఉచిత చేప పిల్లల సరఫరాకు అధికారులు టెండర్ కాల్ ఫర్ చేయగా, ముగ్గురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి టెండర్లు వేశారు. సదరు కాంట్రాక్టర్లకు సంబంధించిన ఫిష్ ఫార్ములను సైతం అధికారులు ఇటీవలే పరిశీలించారు.
– మెదక్ జోన్
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కురిసిన వర్షాలకు 1,728 చెరువులు, కుంటల్లోకి చేపలను పెంచే విధంగా నీరు చేరింది. వీటిలో 5.32 కోట్ల 4 రకాల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు 15 రోజుల క్రితం టెండర్లు పిలిచారు. ఇందులో సంగారెడ్డికి చెందిన ఒకరు, ఖమ్మం జిల్లాకు చెందిన మరొకరు ఆంధ్రాకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ టెండర్ లో పాల్గొన్నారు. టెండర్ వేసిన సదరు కాంట్రాక్టర్ల చేపల పెంపకం షెడ్లను ఇటీవల అధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం చేపలను పెంచుతున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా వారు వేసిన టెండర్లు మరో రెండు మూడు రోజుల్లో ఓపెన్ చేయనున్నారు. ఇందులో ఎవరు తక్కువకు కోడ్ చేస్తే వారికే చేప పిల్లల సరఫరా ప్రక్రియ అప్పజెప్పనున్నారు.
మత్స్యకారులకు మేలు
జిల్లావ్యాప్తంగా 311 మత్స్య సహకార సంఘాలు ఉండగా, వాటిలో 17,630 మంది సభ్యులున్నారు. అధికారులు గుర్తించిన 1,728 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలినట్లయితే జిల్లాలోని మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుంది. ఫలితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. దీంతో జులై మాసంలోనే చేప పిల్లల సరఫరాకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ను అధికారులు బుజ్జగించి 1,728 నీటి వనరుల్లో 5 కోట్ల చేప పిల్లలు వదలాలని సూచించగా సదరు కాంట్రాక్టర్ కేవలం 900 చెరువుల్లో 3 కోట్ల పిల్లలను మాత్రమే వదిలి చేతులెత్తేశాడు. దీంతో మత్స్యకారులకు ఉపాధి కరువైంది. ఈ సంవత్సరం ఉచిత పిల్లలను సరఫరా చేసేందుకు సకాలంలో ముగ్గురు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2 వేల పైచిలుకు చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ ఏడు వర్షాకాలంలో కురిసిన వానలకు 1,728 నీటి వనరుల్లోకి చేపలను పెంచేందుకు సరిపడా నీరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కట్ల, రాహు, బంగారు తీగ, మిర్గా నాలుగు రకాలకు చెందిన 5.32 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా చేపలను వదిలిన సదరు నీటి వనరుల్లో కనీసం 9 మాసాలకు తగ్గకుండా నీటినిలో ఉండాలి. అప్పుడే వదిలిన చేపలు ఒక్కోటి అరకిలో నుంచి 800 గ్రాముల వరకు పెరుగనున్నాయి. లేనట్లయితే చేపల ఎదుగుదల ఉండదు. వీటిని పరిశీలించేందుకు మరోసారి ఇరిగేషన్, మత్స్య సహకార శాఖ అధికారులు చెరువుల్లోని నీటిని క్లుప్తంగా పరిశీలించనున్నారు.
9 నెలలపాటు నీరు నిల్వ ఉండేలా..


