ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానం

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

ఎమ్మెల్సీ కోదండరాంకు సన్మానం బీజేపీ లేబర్‌సెల్‌ జిల్లా కన్వీనర్‌గా శ్యామయ్య టీబీ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాలల రోస్టర్‌ 22ను సవరించాలని అసెంబ్లీలో చర్చించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాంను ఎంసీఎఫ్‌ (మాల కోఆర్డినేషన్‌ ఫోరం), మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌ ఇతర నాయకులు మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా సంజీవ్‌ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో మాలలకు రోస్టర్‌ 22 కేటాయిండంతో విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి రోస్టర్‌ 22ను సవరించి న్యాయం చేయాలన్నారు. మాలలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ కోదండరాం శాసనమండలిలో చర్చించి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చింనందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, శివ, రవి, యాదగిరి, మోషయ్య, ఆనంద్‌, మైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా రీ సర్వే

హవేళిఘణాపూర్‌(మెదక్‌): భూ భారతి రీ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూ రికార్డులను పరిశీలిచాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. మంగళవారం మెదక్‌ మండలం పాశాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న భూ భారతి రీసర్వేను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ల్యాండ్‌ సర్వే కిషన్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.

టేక్మాల్‌(మెదక్‌): మెదక్‌ జిల్లా లేబర్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌గా మండలంలోని కాద్లూర్‌ గ్రామానికి చెందిన నాయికోటి శ్యామయ్య మంగళవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా శ్యామయ్య మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పరిణిత, జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి మల్లారెడ్డి, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవీ బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

పటాన్‌చెరు టౌన్‌: క్షయవ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తొలిదశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని టీబీ జిల్లా కో ఆర్డినేటర్‌ అరుణ సూచించారు. పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, చికిత్స అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు టీబీపై అవగాహన పెంచుకుని, చుట్టుపక్కల ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రవీణ, భాగ్య క్లబ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ శివదీప్తి, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు ప్రొఫెసర్‌ వెంకటేశం, కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement