కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైం తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. మండలంలోని దేవులతండాలో మంగళవారం మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అక్కడే ఎమ్మెల్యే సమక్షంలో కొట్టాల గ్రామానికి చెందిన వార్డుసభ్యులు అనిత, శంకర్‌నాయక్‌తోపాటు 15మంది కాంగ్రెస్‌పార్టీ సభ్యులు బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో నేరాల్లో రాష్ట్రం మూడోస్థానానికి చేరిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పోలీస్, షీటీమ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. తండాలను పంచాయతీ చేయడంతోపాటు ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌డీఎఫ్ నిధులు రూ.50కోట్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని వివర్శించారు. నాడు కేసీఆర్ 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం ఏడు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వెంకట్రాపేటలో ఉప సర్పంచ్ రామాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు ఐకేపీ మహిళలతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్‌లు కోలశ్రీను, ఎల్లం, సుమలత, కుత్‌బొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


