సర్‌.. జోరు! | - | Sakshi
Sakshi News home page

సర్‌.. జోరు!

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

10 వరకు అవకాశం

మెదక్‌ కలెక్టరేట్‌: తప్పుల్లేని ఓటరు జాబితాయే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ జూన్‌ 25 నుంచి చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్‌) ప్రక్రియ జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 91 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయ్యింది. ఇంకా మిగిలిన ఓటర్లు, కొత్త వారి నమోదుకు మరో అవకాశం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈనెల 10 వరకు గడువు పొడిగించింది. జిల్లాలో సర్‌ కార్యక్రమంలో మొత్తం 666 మంది సిబ్బంది చేస్తున్నారు. ఇందులో 586 మంది బీఎల్‌ఓలు, 16 మంది ఏఈఆర్టీలు, 64 మంది బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు ఉన్నారు. జిల్లాలో నకిలీ ఓట్ల తొలగింపు, కొత్త ఓట్లు చేర్చడంలో బూత్‌ లేవల్‌ అధికారులు కీలకంగా పనిచేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి రెండు ఓటరు నమోదు పత్రాలు అందజేసి, ఓటర్ల నుంచి రీకవరీ చేయడానికి గత నెలరోజులుగా విశేష కృషి చేస్తున్నారు. అనంతరం వాటిని డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. అలాగే కొత్త వారికి అవకాశం కల్పించేందుకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారు.

17న ముసాయిదా ఓటరు జాబితా

ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. సెప్టెంబర్‌ 16 వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 15 వరకు ఫిర్యాదుల పరిష్కారానిక చర్యలు తీసుకుంటారు. అక్టోబర్‌ 19వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

జిల్లాలో 91 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

అదే స్థాయిలో ఓటర్ల నుంచి ఫారాల స్వీకరణ

కీలకంగా పనిచేస్తున్న బీఎల్‌ఓలు

సర్‌ కార్యక్రమాన్ని ఈనెల 10 వరకు ఎన్నికల కమిషన్‌ పొడిగించింది. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వందశాతం ‘సర్‌’ నమోదుకు బీఎల్‌ఓలు కృషి చేయాలి. అర్హులైన ప్రతీ ఓటరు తుది జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటాం.

– ప్రతిమాసింగ్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement