పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జనసంద్రంగా మారింది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు చేపట్టారు. సత్రాలు దొరకక భక్తులు చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు.
సకాలంలో
బిల్లులు అందించాలి
ఫుట్‌బాల్ పోటీల్లో రాణించాలి
గజ్వేల్‌రూరల్: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫుట్‌బాల్ పోటీల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఆదివారం గజ్వేల్‌లో జెర్సీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27 నుంచి 29 వరకు మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్ టాగోర్ ఫుట్‌బాల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ గర్‌ల్స్ ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్‌ఐఎస్ కోచ్ నరసింహ, జీఎఫ్‌సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను మరవొద్దు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): ఆర్థిక, స్వేచ్ఛా సమా నత్వం కోసం పోరాడిన మహనీయులను మరవొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ నెల 30న దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో నిర్వహించే మహనీయుల ఉత్సవ సభ కరపత్రాలను ఆదివారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవడం శుభపరిణామమన్నారు. మహనీయులు కలలుగన్న ఆశయాలను నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడానికి చీకోడ్‌లో చేపట్టిన బృహత్ కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక కర్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఆస యాదగిరి, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


