సమన్వయంతో పనిచేయండి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయండి

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి మే 2వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే బాలల భద్రత రక్షణ సంక్షేమ వారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివా రం క్యాంపు కార్యాలయం నుంచి వివిధశాఖల అధికారులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను ఆర్డీఓలు, ఎంపీడీఓలు, పోలీస్‌, మండల ప్రత్యేక అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆర్డీఓలు రమాదేవి, రామకృష్ణ, జయచంద్రారెడ్డి, జిల్లా సంక్షేమాధికారిణి హేమభార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవీ మాత జయంతి

ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవీ మాతకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో వాసవీ మాత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాటాడుతూ.. వాసవీమాత జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీవైఎస్‌ఓ రమేశ్‌, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌, ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ నాగరాజు, నాయకులు చంద్రపాల్‌, మ్యాడం బాలకృష్ణ, అశోక్‌, వనజ, సుష్మ, పద్మ పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement