మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటు

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ పార్టీ మహిళా బిల్లును అడ్డుకోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 33 శాతం రిజర్వేషన్‌ అమలైతే చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ పరిపాలన చేసుకుంటూ రాష్ట్రాలను దోచుకుంటుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేటను అసెంబ్లీ సెంగ్మెంట్‌ చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యం, పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాగి రాములు, మండలశాఖ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, కౌన్సిలర్‌ శంకర్‌గౌడ్‌, సర్పంచ్‌ యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి దిలీప్‌, కిసాన్‌ మోర్చా మండలశాఖ అధ్యక్షుడు సంగయ్య, నాయకులు రమణ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

మల్లేశ్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement