స్వీయ గణనలో పాల్గొనండి | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనలో పాల్గొనండి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జనాభా లెక్కలు ఎవరికి వారు స్వయంగా చేసుకునేలా ప్రభుత్వం యాప్‌ తీసుకొచ్చిందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జాతీయ జనగణన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో ప్రజలు ఈసారి అందుబాటులోకి వచ్చిన డిజిటల్‌ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఆన్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు తమ ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలను ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. వెబ్‌ పోర్టల్‌ను https://se.censes.gov.in ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement