న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగియడంతో శనివారం ఉదయం ప్రగతి చక్రాలు రోడ్డెక్కాయి. చర్చలు సఫలం కావడంతో కార్మికులు మెదక్ ఎదుట టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మేడి రాధాకిషన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. సమ్మె విజయవంతానికి సహకరించిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
– మెదక్ కలెక్టరేట్


