రేగోడ్(మెదక్): పేదలు సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో ఆయన పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రేగోడ్‌లోని లబ్ధిదారుడు మహేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్‌రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాటిల్, ఉపాధ్యక్షుడు భాస్కర్, కో అప్షన్ మా జీ సభ్యుడు చోటుమియా, వట్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా జనగణన
వెల్దుర్తి(తూప్రాన్): జనగణన పకడ్బందీగా చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అదనపు సెన్సెస్ అధికారి జోజి అన్నారు. శనివారం మండల కేంద్రంలో జనగణన టెస్టింగ్ ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. రెండు దశల్లో చేపట్టనున్న జనగణన ప్రక్రియలో మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన, మౌలిక వసతులు వంటి వాటిపై సాగుతుందన్నారు. పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్న క్రమంలో ఎ న్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్ నవీన్, తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీహరి, ఏఎస్‌ఓ సందీప్‌రెడ్డి, సెక్షన్ ఆఫీసర్లు అజీజ్, కలీం పాల్గొన్నారు.
త్వరలోనే ఆర్వోబీ పనులు
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని రైల్వేగేట్‌ను శనివారం రైల్వే డిప్యూటీ ఇంజనీర్ నూరొద్దీన్ హబీబ్ సందర్శించారు. ఈసందర్భంగా రైల్వే గేటు వద్ద నిర్మించే ఆర్వోబీ గురించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రైల్వే గేటును మూసివేసి ఆర్వోబీ పనులు నిర్వహిస్తామన్నారు. వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ దారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఇంజనీర్లు సమీర్, జగదీశ్‌తో పాటు రైల్వే సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు.
రేపు కో ఆప్షన్
ఎన్నికల సమావేశం
మెదక్ కలెక్టరేట్: ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు మెదక్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పురపాలక సంఘ సాధారణ సర్వసభ్య సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు హాజరు కానున్నట్లు చెప్పారు.
మల్లికార్జునుడికి
హైకోర్జు జడ్జి పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసా దం, శేషవస్త్రాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల న్యాయమూర్తి తరుణి, సీఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


