నియోజకవర్గానికో ‘ఏటీసీ’ | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గానికో ‘ఏటీసీ’

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌

పోటీ ప్రపంచంలో రాణించాలంటేస్కిల్స్‌ అవసరం

నర్సాపూర్‌ రూరల్‌: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభిస్తామని మంత్రి వివేక్‌ తెలిపారు. శనివారం మండలంలోని నారాయణపూర్‌లో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే స్కిల్స్‌ అవసరం అన్నారు. అందుకే ఏటీసీ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడిలో చేర్పించి చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, సర్పంచ్‌ దేవిసింగ్‌, ఎంఈఓ తారాసింగ్‌, హెచ్‌ఎం రవి తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారంటీలు అమలు

నర్సాపూర్‌: తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని మంత్రి వివేక్‌ చెప్పారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి పథకం కింద రూ. 15 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి వడ్డీలు చెల్లించడం తమకు భారంగా తయారైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కావొద్దని మాజీ సీఎం కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేసి అండగా నిలిచారని అన్నారు. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పలు పనులను నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement