రామాయంపేట(మెదక్): అంగన్‌వాడీల్లో కిచెన్ గార్డెన్లు తప్పనిసరని, ఏర్పాటు చేయని టీచర్లపై చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఐసీడీఎస్ సెక్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంగన్‌వాడీల్లో సాధ్యమైనంత మేర ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. చిన్నారులను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేఽశారు. ఎంపీ వెళ్లిపోయిన అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చిన్నారులకు గ్యాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేసి మోడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, సంఘం మండలశాఖ అధ్యక్షుడు ప్రభాకర్, సీడీపీఓ స్వరూప, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు


