చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

దుబ్బాక: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్‌ కార్యాలయంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యతో కలిసి స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు లేవని వెంటనే స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీల, వైస్‌ చైర్‌పర్సన్‌ సులోచన, కౌన్సిలర్లు, సీడీపీఓ ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement