మెదక్ కలెక్టరేట్: మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ఉద్యమం చేపడతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ కేవల్ కిషన్ భవనంలో జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న పనిగంటలను పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను తొలగించడం సిగ్గుచేటు అన్నారు. మే 1 నుంచి 7 వరకు మే డే వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు


