రామాయంపేట(మెదక్): రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. మండలంలోని దామరచెరువులో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యాపారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలి, ఉపసర్పంచ్ పిట్ల నరేశ్, మాజీ సర్పంచ్ శివప్రసాదరావు, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్


