నష్టపోయిన రైతులను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోండి

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

సిద్దిపేటజోన్‌: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు ఐదు సార్లు వడగళ్ల వాన, ఒకసారి తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నివేదిక ఆధారంగా పరిహారం చెల్లించాలన్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు వివిధ పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్‌, నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్‌ మండల పరిధిలో అధి కంగా పంట నష్టం వాటిల్లిందన్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement