పంప్‌ హౌస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

పంప్‌ హౌస్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

నంగునూరు(సిద్దిపేట): మండలంలోని వాగవతలి గ్రామాలకు సాగు నీరందించేందుకు ఘణపూర్‌ వద్ద నిర్మించిన పంప్‌ హౌస్‌ పూర్తి కావడంతో శుక్రవారం ఇరిగేషన్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ చేపట్టారు. రంగనాయకసాగర్‌ కుడి కాలువ ద్వారా ఖాతా, ఘణపూర్‌, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాల్లోని 13 చెరువులను నింపేందుకు ఘణపూర్‌ వద్ద పంప్‌ హౌస్‌ నిర్మాణం కోసం అప్పటి మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా మిగిలిన పనులు పనులు పూర్తి కావడంతో ఇరిగేషన్‌ అధికారులు ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement