నర్సాపూర్: జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ శనివారం నర్సాపూర్‌లో పర్యటిస్తారని తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి తెలిపారు. నగరాభివృద్ధి నిధులతో పట్టణంలోని 15 వార్డుల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని ఆరో వార్డులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం, మండలంలోని నారాయణపూర్‌లో ‘బడిబాట’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేస్తారని వారు వివరించారు.


